మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
- October 31, 2017
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మంగళవారం ఇందిరాగాంధీ 33 వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందిస్తూ... ''మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు...'' అని పేర్కొన్నారు. కాగా ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు కూడా ఘనంగా నివాళులు అర్పించారు.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.. తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఆమె తన బాడీగార్డుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ప్రారంభించిన ఏడాదే ఆమె హత్యకు గురయ్యారు. 1975లో 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఇందిరా గాంధీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ఎమర్జెన్సీ విధించిన కాలాన్ని ఇప్పటికీ స్వతంత్ర భారత దేశంలో ''చీకటి యుగం''గా పిలుస్తారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు