నవంబరు 7 నుంచి 10వతేదీ వరకు 300 విమాన సర్వీసులను రద్దు చేసిన ఢిల్లీ విమానాశ్రయం
- October 31, 2017
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక అంటూ ఓ ప్రకటన చేశారు. వచ్చే నెల (నవంబరు) 7 నుంచి మూడురోజుల పాటు ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు రన్ వేలకు మరమ్మతులు చేపడుతున్నందున 30 శాతం విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. సాధారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో గంటకు 67 విమానాలు వచ్చిపోతుంటాయి. కాని మూడు రన్ వేలకు మరమ్మతులు చేపడుతున్నందు వల్ల గంటకు వచ్చి పోయే విమానాల సంఖ్యను 45కు తగ్గించామని అధికారులు పేర్కొన్నారు. నవంబరు 7 నుంచి 10వతేదీ వరకు దాదాపు 300 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీకి వచ్చి పోయే విమాన ప్రయాణికులు గమనించాలని విమానాశ్రయ అధికారులు కోరారు. విమానాశ్రయంలో మరమ్మతు పనుల వల్ల కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్ వేస్ లు ఇప్పటికే ప్రకటించాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







