నకిలీ పాస్‌పోర్టు కేసులో ఛోటా రాజన్‌కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ
- November 07, 2015
నకిలీ పాస్‌పోర్టు కేసులో మాఫియా డాన్ ఛోటా రాజన్‌కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. భద్రతా కారణాల నేపథ్యంలో శనివారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే కోర్టు విచారణ జరిపింది. అనంతరం మేజిస్ట్రేట్ అతణ్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. నకిలీ పాస్‌పోర్టుతో దేశం విడిచిపారిపోయినందుకు రాజన్‌పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఇందులో ఒక కేసును అతడిని తీసుకురావడానికి మలేసియా వెళ్లే ముందు కిందటి నెల 31న నమోదు చేసింది. ఈ కేసులోనే కోర్టు అతడికి సీబీఐ కస్టడీ విధించింది. గతనెల 25న ఆస్ట్రేలియా నుంచి ఇండోనేసియాకు వచ్చిన రాజన్‌ను బాలిలో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బాలి నుంచి సీబీఐ అధికారులు రాజన్(అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే)ను ఢిల్లీకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజన్ నకిలీ పాస్‌పోర్టులో తండ్రి పేరుగా రాజన్ పేరే ఉంది. ఇండోనేసియా నుంచి ఢిల్లీకి రాజన్‌ను తరలించాక అతని నుంచి అధికారులు సేకరించిన వాటిలో ఈ పాస్‌పోర్టు ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







