'జైసింహా' ఫస్ట్‌లుక్.!
- November 01, 2017
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. బాలయ్య 102వ చిత్రం 'జైసింహా' ఫస్ట్‌లుక్ బుధవారం విడుదలైంది. తొలి ప్రచార చిత్రంలో బాలయ్య తనదైన స్టైల్‌లో అదరగొట్టారు. చేతిలో కర్రపట్టుకుని పోరాడుతున్నట్లు కనిపించారు. పోస్టర్‌లో ప్రజలు ధర్నా చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. దీంతోపాటు అందులోని బాలయ్య తండ్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కె.ఎస్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. హరిప్రియ, నటాషా దోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ అరకులో జరుగుతోన్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించనున్నారు. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







