పోలీసుశాఖపై దృష్టి సారించిన కేసీఆర్

- November 07, 2015 , by Maagulf
పోలీసుశాఖపై దృష్టి సారించిన కేసీఆర్

నిరుద్యోగుల ఎదురుచూపులకు క్రమంగా తెరపడుతోంది. ట్రాన్స్‌కో, జెన్‌కో, టౌన్‌ప్లానింగ్ వంటి విభాగాల్లో నియామాకాలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా పోలీసుశాఖపై దృష్టి సారించింది. పోలీసు ఉద్యోగ నియామకాల దస్త్రంపై సీఎం కేసీఆర్ నేడు సంతకం చేశారు. 9 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. నియామకాల్లో 33 శాతం మహిళలు ఉండాలని నిర్ణయం. సివిల్ పోలీస్ నియామకాల్లో ఆర్మ్‌డ్ రిజర్వుడ్ పోలీసుల నియామకాల్లో మహిళలకు 10 శాతం కోటా కేటాయింపు. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. - సివిల్ ఎస్‌ఐ పోస్టులు 107 - అగ్నిమాపక శాఖలో 510 - ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ 186 - సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 1,880 - ఆర్మ్‌డ్ కానిస్టేబుల్స్ 2,800 పోస్టులు - ప్రత్యేక పోలీసులు 3,200 - ఆర్మ్‌డ్ ఎస్‌ఐలు 91 - ప్రత్యేక పోలీసు ఎస్‌ఐ పోస్టులు 288 - 35 కమ్యూనికేషన్ ఎస్‌ఐలతో పాటు పలు పోస్టుల నియామకానికి అంగీకారం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా రాతపరీక్షలో తెలంగాణ చరిత్రను తప్పనిసరి చేసిన ప్రభుత్వం పురుషులకు 5 కి.మీ., మహిళలకు 2.5 కి.మీ. పరుగు పోటీ రద్దుచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com