న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడి చేసిన ఉగ్రవాదికి మరణశిక్ష విధించండి
- November 02, 2017
న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడి చేసి 8 మంది మృతికి కారణమైన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్‌కు మరణశిక్ష విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందని ఉబర్ డ్రైవర్ సైపోవ్‌ను ఉగ్రవాదిగా చిత్రీకరించిన ట్రంప్.. ఆ ఉన్మాదికి మరణశిక్ష విధించాలని తన ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముస్లిం దేశాలపై అనేక ఆంక్షలు విధించారు. ఆ దేశాల నుంచి వస్తున్న వారిని క్షుణ్ణంగా ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. అయినా కానీ అమెరికాలో ముస్లిం తీవ్రవాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా ట్రంప్ తన అధికారాలను ఉపయోగించకపోయినా.. న్యూయార్క్ ఉగ్రవాదిని ఉరి తీయాలని తన ట్వీట్ ద్వారా వెల్లడించడం సంచలనమే. ఉగ్రవాది సైపోవ్ ప్రస్తుతం న్యూయార్క్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇస్లామిక్ స్టేట్ వీడియోలను వీక్షించిన తర్వాత.. ఏడాది క్రితమే ఈ దాడి కోసం ప్లానేసినట్లు ఆ ఉగ్రవాది చెప్పాడు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







