తమిళనాడు మల్టీప్లెక్స్‌ లో టికెట్ ధర తగ్గనుంది

- November 07, 2015 , by Maagulf
తమిళనాడు మల్టీప్లెక్స్‌ లో టికెట్ ధర తగ్గనుంది

మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలని అందరు కోరుకుంటారు..కానీ అక్కడి టికెట్స్ రేటు, బ్రేక్ లో స్నాక్స్‌ ఆయె ఖర్చు చూసి సామాన్య ప్రజలు మల్టీప్లెక్స్‌ లో సినిమా చూడాలంటే భయపడతారు..కానీ ఇప్పటినుండి అలాంటి ఏ భయం లేకుండా మల్టీప్లెక్స్‌ లో ఎవరయినా , మాములు ధియేటర్ రేటు కే సినిమా చూసేలా హైకోర్ట్ చర్యలు తీసుకుంది..కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు, పక్క రాష్ట్రం తమిళనాడు లో ఈ సువర్ణ అవకశం కల్పించింది.వివరాల్లోకి వెళ్తే. తమిళనాడులో మల్టీప్లెక్స్‌ ధియేటర్ లలో టిక్కెట్‌ ధర రూ.120లు నుంచి రూ.84కు తగ్గిపోనుంది. దీనికి కారణం అక్కడ వినోదపు పన్ను మినహాయింపు పొందుతున్న సినిమాల టిక్కెట్లపై వినోదపు పన్ను వసులు చేయకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం తో టికెట్స్ రేటు తగ్గనుంది. దీంతో వినోదపు పన్నులేని చిత్రాలన్నీ రూ.84 పెట్టి మల్టీప్లెక్స్‌ లో సినిమా చూడచ్చు..ఈ తీర్పు తో తమిళ సినీ అబిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com