టీడీపీలోకి వైఎస్ ఆప్తుడు కూచిపూడి సాంబశివరావు
- November 03, 2017
అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు గా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు ,విజయ దంపతులు రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని టాక్ .
దీంతో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరు అతి త్వరలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని సమాచారం .అయితే అప్పట్లో గతంలో దివంగత సీఎం వైఎస్ ఆశీస్సులతో కూచిపూడి సాంబశివరావుకు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పదవి దక్కింది.
ఆయన భార్య విజయను గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వరించింది .నాడు బాబు పాలనకు వ్యతిరేకంగా వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు తొలి రోజు నుంచి ఆయనతో పాటు నడిచిన చరిత్ర సాంబశివరావుది. ఆ కారణంతోనే వైఎస్ సీఎం కాగానే, సాంబశివరావుకు నామినేటెడ్ పోస్టును, విజయకు జడ్పీ చైర్మన్ పదవిని ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.నాగార్జున వర్శిటీలో బోటనీ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె, వైఎస్ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







