ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులకు 'శిరస్త్రాణం తప్పనిసరి'
- November 08, 2015
ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులకు 'శిరస్త్రాణం (హెల్మెట్) తప్పనిసరి' చేస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఈనెల 12వ తేదీ నుంచి ద్విచక్రవాహనదారులు శిస్త్రారాణంను విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే, శిరస్త్రాణం వాడకంపై ఆదివారం నుంచి బుధవారం వరకు నాలుగు రోజుల పాటు అవగాహన కల్పించాలని.. వినియోగించని వారిపై గురువారం నుంచి కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లాల రవాణా అధికారుల్ని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశించారు. నిజానికీ ఈ నిబంధన నవంబరు 1నే అమల్లోకి వచ్చినప్పటికీ గంట వ్యవధిలోనే.. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరుసటిరోజు సుప్రీంకోర్టు కమిటీ ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాహనదారుల్లో అవగాహన పెంచి వెంటనే ఈ నిబంధనను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రానున్న ప్రత్యేక బృందాలు హెల్మెట్ నిబంధన అమలు, ఎన్ని కేసులు నమోదు చేశారన్న వివరాలతో డిసెంబరు 4వ తేదీనాటికి నివేదిక పంపాలని ఏపీ రవాణాశాఖను ఇటీవల ఢిల్లీలో జరిగిన విచారణ సమయంలో ప్రమాదాల నియంత్రణపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ఆదేశించింది.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









