తమిళనాడు మల్టీప్లెక్స్ లో టికెట్ ధర తగ్గనుంది
- November 07, 2015
మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలని అందరు కోరుకుంటారు..కానీ అక్కడి టికెట్స్ రేటు, బ్రేక్ లో స్నాక్స్ ఆయె ఖర్చు చూసి సామాన్య ప్రజలు మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే భయపడతారు..కానీ ఇప్పటినుండి అలాంటి ఏ భయం లేకుండా మల్టీప్లెక్స్ లో ఎవరయినా , మాములు ధియేటర్ రేటు కే సినిమా చూసేలా హైకోర్ట్ చర్యలు తీసుకుంది..కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు, పక్క రాష్ట్రం తమిళనాడు లో ఈ సువర్ణ అవకశం కల్పించింది.వివరాల్లోకి వెళ్తే. తమిళనాడులో మల్టీప్లెక్స్ ధియేటర్ లలో టిక్కెట్ ధర రూ.120లు నుంచి రూ.84కు తగ్గిపోనుంది. దీనికి కారణం అక్కడ వినోదపు పన్ను మినహాయింపు పొందుతున్న సినిమాల టిక్కెట్లపై వినోదపు పన్ను వసులు చేయకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం తో టికెట్స్ రేటు తగ్గనుంది. దీంతో వినోదపు పన్నులేని చిత్రాలన్నీ రూ.84 పెట్టి మల్టీప్లెక్స్ లో సినిమా చూడచ్చు..ఈ తీర్పు తో తమిళ సినీ అబిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







