అమెజాన్లో వాటా విక్రయించిన జెఫ్ బిజోస్
- November 04, 2017
అమెరికా సంపన్నుడు జెఫ్ బిజోస్ మరోసారి అమెజాన్లో షేర్లను విక్రయించారు. ఆయన ఈ వారంలో 10లక్షల షేర్లను 1.1బిలియన్ డాలర్లుకు అమ్మేశారు. ఈ విషయంపై శుక్రవారం అమెరికా సెక్యూర్టీస్కు సమాచారం అందజేశారు. ప్రస్తుతం అమెజాన్లో 1.3శాతం వాటా విక్రయించినట్లైంది. ఆయనకు ఇంకా అమెజాన్లో 16.4శాతం వాటా ఉంది. తాను ఏటా బిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయిస్తానని ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో తెలిపారు. బ్లూఆరిజిన్ ఎల్ఎల్సి అనే రాకెట్ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఈ షేర్లను విక్రయించారు. మనుషులను అంతరిక్షంలోకి పంపించే ప్రాజెక్టుపై బ్లూఆరిజిన్ పనిచేస్తోంది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు బిజోస్ గతంలో కూడా 10 లక్షల షేర్లను విక్రయించాడు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







