ఆసియా టూర్కు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- November 04, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ పర్యటిస్తారు. సుమారు 25 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో ఇంత సుదీర్ఘంగా పర్యటించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఉత్తర కొరియాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఈశాన్య ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించడం చర్చాంశంగా మారింది. ఉత్తర కొరియాపై వత్తిడి తెచ్చేందుకు చైనాను ట్రంప్ నిలదీసే అవకాశాలున్నాయి. ఆసియా టూర్ మొదలుపెట్టిన ట్రంప్.. మొదటగా హవాయి చేరుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దాడి చేసిన పెరల్ హార్బర్ ప్రాంతాన్ని కూడా ట్రంప్ విజిట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







