అమెజాన్‌లో వాటా విక్రయించిన జెఫ్‌ బిజోస్‌

- November 04, 2017 , by Maagulf
అమెజాన్‌లో వాటా విక్రయించిన జెఫ్‌ బిజోస్‌

అమెరికా సంపన్నుడు జెఫ్‌ బిజోస్‌ మరోసారి అమెజాన్‌లో షేర్లను విక్రయించారు. ఆయన ఈ వారంలో 10లక్షల షేర్లను 1.1బిలియన్‌ డాలర్లుకు అమ్మేశారు. ఈ విషయంపై శుక్రవారం అమెరికా సెక్యూర్టీస్‌కు సమాచారం అందజేశారు. ప్రస్తుతం అమెజాన్‌లో 1.3శాతం వాటా విక్రయించినట్లైంది. ఆయనకు ఇంకా అమెజాన్‌లో 16.4శాతం వాటా ఉంది. తాను ఏటా బిలియన్‌ డాలర్లు విలువైన షేర్లను విక్రయిస్తానని ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలిపారు. బ్లూఆరిజిన్‌ ఎల్‌ఎల్‌సి అనే రాకెట్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఈ షేర్లను విక్రయించారు. మనుషులను అంతరిక్షంలోకి పంపించే ప్రాజెక్టుపై బ్లూఆరిజిన్‌ పనిచేస్తోంది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు బిజోస్‌ గతంలో కూడా 10 లక్షల షేర్లను విక్రయించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com