కుటుంబ కథా చిత్రంలో శ్రీముఖి
- November 04, 2017
బుల్లి తెర నుండి వెండి తెరపై వెలిగి పోదామని వచ్చిన హీరోయిన్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు. యాంకర్ అనసూయ వెండి తెరపై సపోర్టింగ్ క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటుంటే.. రష్మీ, శ్రీముఖిలు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బాబు బాగా బిజీ చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేసినా ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. సో..మరోసారి హీరోయిన్గా మన ముందుకు రాబోతోంది. ఈ సారి హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో లీడ్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత మరో సినిమా వి.ఎస్.వాసు దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రం అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారట. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందూ హీరోగా, శ్రీముఖి హీరోయిన్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీముఖి ఈ చిత్రంలో సాప్ట్వేర్ ఎంప్లాయ్‌గా కనిపించనుందట. కొత్తగా పెళ్లైన జంట మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్‌తో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాలైనా శ్రీముఖికి సక్సెస్‌ని ఇస్తాయో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష