మరిన్ని విభిన్న కథలతో బిజీ గా ఉన్న టెన్నీస్ చాంప్

- November 04, 2017 , by Maagulf
మరిన్ని విభిన్న కథలతో బిజీ గా ఉన్న టెన్నీస్ చాంప్

ప్రేమకథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, ఈ ఏడాది మల్టిస్టారర్ మూవీ శమంతకమణితో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన సుధీర్, ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు.

సుధీర్ కొత్త దర్శకుడు ఇంద్రసేనతో  ఒక సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ సోషల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతుంది. ఇక ఆ తర్వాత మరో కొత్త డైరెక్టర్ రాజశేఖర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీ ప్రేమకథతో తెరకెక్కబోతుంది. అలాగే మరో సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ లవ్ స్టోరీ చేయడానికి సన్నహాలు చేస్తున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com