అమెరికా ఫస్ట్‌ లేడీ కి ఫిమేల్ పోలీస్ స్కాడ్

- November 04, 2017 , by Maagulf
అమెరికా ఫస్ట్‌ లేడీ కి ఫిమేల్ పోలీస్ స్కాడ్

టోక్యో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల పర్యటన ప్రారంభమైంది. ఆయనతో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఈ టూర్‌కు వెళ్తున్నారు. ట్రంప్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ కూడా ఇప్పటికే జపాన్ చేరుకున్నారు.
ఈ పర్యటన సందర్భంగా అమెరికా ఫస్ట్ లేడీ మెలానియాకు ప్రత్యేక భద్రతా బృందాన్ని ఏర్పాటు చేశారు. వాళ్లంతా మహిళలే కావడం విశేషం. ట్రంప్, ఆయన భార్య మెలానియా ఆదివారం టోక్యో చేరుకోనున్నారు.
జపాన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఆ దేశ మహిళా భద్రతాధికారులు మెలానియా, ఇవాంకాకు ప్రత్యేక భద్రతను కల్పించనున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే మెలానియా, ఇవాంకాలు జపాన్‌లో పర్యటించనున్నారు.
ఈ ఇద్దరి చుట్టూ మొత్తం మహిళా భద్రతా సిబ్బందే ఉంటారు. ఈ బృందంలో ఒక్క మగ పోలీసు కూడా ఉండరు. ఈ నేపథ్యంలో ఫిమేల్ పోలీస్ స్కాడ్ టోక్యోలో మీడియా ముందు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.
బ్లాక్ సూట్‌తో వాళ్లు ఓ డ్రిల్ చేశా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com