అఫ్ఘనిస్తాన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ బ్యాన్
- November 04, 2017
కాబూల్: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోవడంతో వాట్సాప్ క్షమాపణ చెప్పక తప్పలేదు. మరోవైపు అఫ్ఘనిస్తాన్‌లో వాట్సాప్‌కు మరో చిక్కు వచ్చి పడింది. దేశంలో వాట్సాప్ మెసెంజర్ యాప్ పై తాత్కాలింగా నిషేధం విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు టెలిగ్రామ్ అనే మరో మెసేజింగ్‌యాప్‌ను కూడా నిషేధించడం సంచలనం సృష్టించింది.
20 రోజులు సేవలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయమని ప్రకటించింది. ఇది తాత్కాలికమేనని, రివ్యూ అనంతరం అనంతరం ఈ సేవలను తిరిగి పున:రుద్దరిస్తామని తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు, ఇతర తీవ్రవాద గ్రూపులువాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కీలకమైన ప్రభుత్వ సమాచారాన్ని కూడా వాట్సాప్ నుంచి మిలిటెంట్ గ్రూప్స్కు చేరుతోందని నిఘా వర్గాల హెచ్చరించినట్టు తెలిపింది. పరిస్థితులను పరిశీలించిన మీదట నిషేధం కొనసాగించాలా లేదా అన్నది స్పష్టం చేస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ నవంబర్ మాసం మొత్తం ఈ మెసెంజర్ యాప్ పని చేయదు.
జాతీయ భద్రతా చట్టబద్ధమైన సమస్యలున్నట్లయితే, పలుయాప్‌ల సేవలను నిలిపివేయాల్సిందిగా సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించే చట్టపరమైన హక్కు ఉందని టెలికాం రెగ్యులేటరీ మాజీ అధికారి అజ్మల్ అయాన్ వివరించారు. మరోవైపు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది చట్ట వ్యతిరేకమని, భావ ప్రకటనాస్వచ్ఛ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ ముజీబ్ ఖల్వాట్గార్ విమర్శించారు. ఇవి మొత్తం మీడియాపై నిషేధానికి దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







