సౌదీ లో 11 మంది యువరాజులు అరెస్టు
- November 04, 2017
పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వ అరెస్టు చేసింది. రాజుగా మహ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్‌ను సౌదీ ప్రారంభించింది. కమిషన్ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే అరెస్టులు జరగడం గమనార్హం.
అంతకుముందు సౌదీ నేషనల్ గార్డ్ హెడ్, నేవీ చీఫ్, ఆర్థిక శాఖ మంత్రులను సల్మాన్ పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిషన్ పాత కేసులను తిరగదోడిన నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్ధ ‘అల్ అరేబియా’ పేర్కొంది. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష