రైతు ఆదాయం పెంచడమే లక్ష్యం: కేటీఆర్
- November 04, 2017
20 వేల కోట్ల పెట్టుబడులు..లక్ష ఉద్యోగాలు. రైతులకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్‌లో ప్రభుత్వ విధానాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెండింతలు చేస్తామని ప్రకటించారు. రెండు రోజుల్లో 13 సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఇస్తున్న రాయితీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం పెద్దదే అయినా.. రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో అనుసంధానం చేయడం ద్వారా అది సాధ్యమవుతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. లక్షా ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు .తెలంగాణను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు
సులభతర వాణిజ్య, వ్యాపార అంశంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి, టీఎస్ ఐపాస్ ద్వారా ఐదు వేల అనుమతులిచ్చామన్నారు. దీంతో లక్ష కోట్ల పెట్టుబడులు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను 20 శాతానికి పెంచుతామని కేటీఆర్ ప్రకటించారు. ఇక రెండురోజుల ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్‌లో 13 సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది. జర్మన్ ఏషియా అసోసియేషన్‌తో నాలెడ్జ్, టెక్నాలజీ అంశాల్లో ఎంవోయూ చేసుకుంది. జహీరాబాద్ నిమ్జలో 6 వేల కోట్లతో సమగ్ర వ్యవసాయ ఆహార పరిశ్రమ నెలకొల్పేందుకు దక్షిణ్ ఆగ్రో పోలిస్ సంస్థ ముందుకొచ్చింది. మొత్తం ఒప్పందాల విలువ 7 వేల 2 వందల కోట్లకు చేరింది. వీటి ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!