6న 'భాగమతి' తళుక్కుమననుంది
- November 05, 2017
హైదరాబాద్: అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'భాగమతి'. జి. అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అనుష్క పుట్టినరోజు సందర్భంగా నవంబరు 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'బాహుబలి: ది కన్‌క్లూజన్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనుష్క నటించిన చిత్రమిది.
యూవీ క్రియేషన్స్ సంస్థ 'భాగమతి'ని నిర్మిస్తోంది. ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి, జయరాం, ఆశా శరత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'భాగమతి' తర్వాత అనుష్క తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే దర్శకుడు గౌతమ్ మేనన్ తెరకెక్కించనున్న ఓ చిత్రంలో ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు సినీవర్గాల సమాచారం. ఇందులో పాత్ర కోసమై దర్శక, నిర్మాతలు ఆమెను ఇటీవల కలిశారట. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







