'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్‌గా 'ఊపిరి'
- November 09, 2015
తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ్ హీరో కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'ఊపిరి' వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించనుండగా, అనుష్క, అడవి శేష్‌లు ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్‌లో కనిపిస్తాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. హాలీవుడ్‌కు చెందిన 'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్‌గా తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరో నెల రోజు పాటు సినిమాను షూట్ చేసి, 2016 ఫిబ్రవరి 5న దీన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి.పొట్లూరి 'ఊపిరి' సినిమాను నిర్మిస్తుండగా, గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







