తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఓమాన్ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు నియామకం

- November 06, 2017 , by Maagulf
తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్  ఓమాన్ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు నియామకం

గల్ఫ్ వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ విదేశీ విభాగం ఓమాన్ శాఖ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు ను నియమిస్తూ సంస్థ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోమవారం (06.11.2017) హైదరాబాద్ లో నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి రాజారపు, కార్యవర్గ సభ్యులు మహ్మద్ బషీర్ అహ్మద్ తోపాటు సభ్యులు ఎన్.బాచిరెడ్డి, శేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు 

ఓమాన్ లో ప్రముఖ ప్రవాస భారతీయుడైన నరేంద్ర పన్నీరు జగిత్యాలకు చెందినవారు. ఓమాన్ దేశంలోని మస్కట్ లో ఒక టెలికం కేబుల్ కంపెనీ యజమాని అయిన నరేంద్ర పన్నీరు తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'గల్ఫ్' సినిమా కు ఆయన ఓవర్సీస్ అంబాసిడర్ గా వ్యవహరించారు. 

ఫోటో: నరేంద్ర పన్నీరు కు నియామక పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com