ఉద్దరించాల్సిన ఉపాధ్యాయులే...కీచకులైతే ?
- November 06, 2017
కువైట్ : చదువులు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు చవకబారు వేషాలు వేశారు. ఫలితంగా జైలుశిక్ష, దేశ బహిష్కరణకు గురయ్యారు.ఈజిప్ట్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కువైట్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అల్ రాయ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడ్డారు. ఓ నిందితుడు మహిళను వేధించగా మరో వ్యక్తి బాలికను సతాయించాడు. సిబ్బంది వీరి చేష్టలను గమనించడంతో నెమ్మదిగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. బాధితుల సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు తీర్పువెలువరించింది. నిందితులిద్దరినీ దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించింది. కేసు విచారణ సమయంలో నిందితులు న్యాయస్థానంలో తాము ఎటువంటి నేరం చేయలేదని అడ్డం తిరిగేరు. తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని అబద్దాలు ఆదెరు . కానీ దుకాణంలో ఉన్న సీసీ కెమేరాలో వారు చేసిన వెకిలిచేష్టలు రికార్డైన దృశ్యాలు చూపించడంతో ఇద్దరూ నిందితులు నోరుమూశారని పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ మేజర్ జనరల్ ఇబ్రహిం అల్ తరహ్ తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







