సునీల్ 'కృష్ణాష్టమి' తో సంక్రాంతి

- November 09, 2015 , by Maagulf
సునీల్ 'కృష్ణాష్టమి' తో సంక్రాంతి

ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు స్టార్ హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీలు పడుతుంటారు. అయితే ఈ సీజన్‌కు మాత్రం హీరో సునీల్ తన కొత్త సినిమా 'కృష్ణాష్టమి'తో అగ్ర హీరోలకు పోటీనిచ్చేందుకు రెడీ అయ్యాడు. 2016 సంక్రాంతి బరి నుంచి మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం', పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్‌'లు తప్పుకున్నాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్' సినిమాలు మాత్రమే ఈ సారి సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. తమిళ హీరో సూర్య '24', నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలు సంక్రాంతి విడుదల బరిలో తాజాగా చేరగా, సునీల్ తన 'కృష్ణాష్టమి'తో వీరితో పోటీ పడనున్నాడు. షూటింగ్ పార్ట్‌ని ఈ సినిమా ఇప్పటికే పూర్తి చేసుకోగా నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని, అందుకే పండగకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది. సో, ఈ 5 సినిమాల్లో ఏవి బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటాయో మరికొంత కాలం వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com