మద్యం మత్తులో భర్తతో భార్య గొడవ.. విమానం మల్లింపు

- November 06, 2017 , by Maagulf
మద్యం మత్తులో భర్తతో భార్య గొడవ.. విమానం మల్లింపు

మద్యం మత్తులో ఓ మహిళ తనని మోసం చేశాడని భర్తపై గొడవపడి ఏకంగా విమానాన్నేదారి మళ్లించింది. వివరాల్లోకి వెళితే.. ఇరాక్‌ చెందిన ఓ మహిళ భర్త, కుమారుడితో ఢిల్లీ నుంచి బాలి వెళ్లేందుకు ఆదివారం ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన దోహా-బాలి క్యుఆర్‌ - 962 విమానం ఎక్కారు. భర్తపై అనుమానంతో భార్య తాను నిద్రపోతున్న సమయంలో భర్త ఫోన్‌ని అతని వేలిముద్రతో అన్‌లాక్‌ చేసి చూసింది. తీరా అందులో వేరే యువతి ఫోటోలు, కాల్‌ లిస్ట్‌ చూసింది. దీంతో భర్త తనను మోసంచేశాడని అందరి ముందు గొడవ పడి నానా రచ్చ చేసింది.

అప్పటికే తాగి ఉన్న ఆమె తోటి ప్రయాణికులు, ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఎంత చెప్పినా వినకపోవడంతో పాటు, వారిపై తిరగబడింది. అదుపు చేయలేని స్థితిలో సబ్బంది దారి మళ్లించి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఆ కుటుంబాన్ని దింపేశారు. అనంతరం విమానాన్ని బాలికి తరలించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ విమానం చెన్నైలో ల్యాండ్ అయినట్లు సీఐఎస్‌ఎఫ్ ‌(సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెక్యురిటీ ఫోర్స్‌)  అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com