దుబాయ్‌లోని ప్రముఖ రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్
- November 07, 2017
సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని ముఖ్యమైన రోడ్లన్నీ ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడాయి. ట్రాఫిక్ మ్యాప్స్‌లో దాదాపు అన్ని రోడ్లూ జామ్ అయిపోయినట్లుగా కనిపించాయి. సుమారు 90 నిమిషాలపాటు వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అల్ సరయత్ స్ట్రీట్ - జుమైరా లేక్ టవర్స్‌లో సర్వీస్ పైప్‌లైన్ సమస్య కారణంగా ట్రాఫిక్ జామ్ తలెత్తింది. బిజినెస్ బే ఏరియా నుంచి షేక్ జాయెద్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ రౌండెబౌట్ వరకూ ట్రాఫిక్ సమస్య కనిపించింది. ఫైనాన్షియల్ సెంటర్ రోడ్, అల్ వసల్ రోడ్, అల్ సఫా స్ట్రీట్స్‌లోనూ ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. ముఖ్యమైన రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు క్రమక్రమంగా వాహనదారులకు ఉపశమనం కల్గించాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







