డేంజర్‌ జోన్‌లో దేశ రాజధాని

- November 07, 2017 , by Maagulf
డేంజర్‌ జోన్‌లో దేశ రాజధాని

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. నగరంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. చిన్నారులను ఆరుబయట ఆటలకు వెళ్లనీయవద్దని వైద్యులు సూచించారు.మరోవైపు ఈ నెలలో నిర్వహించ తలపెట్టిన హాఫ్‌ మారథాన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వానికి ఇండియన్‌ మెండికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పర్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం) పెచ్చుమీరిందని, దీని బారి నుంచి రన్నర్లు, వాలంటీర్లను కాపాడేందుకు ఈనెల 19న జరగాల్సిన పరుగును రద్దు చేయాలని కోరింది.

ఉదయపు నడక, జాగింగ్‌ను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని వాకర్లకు సూచించింది. స్కూళ్లకు కొద్దిరోజులు సెలవులు ప్రకటించాలని సీఎం కేజ్రీవాల్‌ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను కోరారు. ఇక ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పు కలిగించే పీఎం 2.5 స్థాయి ఢిల్లీలో 703కు చేరుకుందని అమెరికన్‌ ఎంబసీ వెబ్‌సైట్‌ పేర్కొనడంతో ఐఎంఏ అప్రమత్తమై ఢిల్లీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

నగరంలో కాలుష్యం ఆందోళనకరంగా పెరగడంతో ఢిల్లీలో పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించామని ఇండియన్‌ మెండికల్‌ అసోసియేషన్‌ ఐఎంఏ చీఫ్‌ కృష్ణకుమార్‌ అగర్వాల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com