నిజాయితీ: షార్జాలో ఇద్దరు భారతీయ మహిళలకు పోలీస్‌ సన్మానం

- November 07, 2017 , by Maagulf
నిజాయితీ: షార్జాలో ఇద్దరు భారతీయ మహిళలకు పోలీస్‌ సన్మానం

షార్జా పోలీసులు, ఇద్దరు భారతీయ మహిళలను సన్మానించారు. తమకు దొరికిన పెద్ద మొత్తం సొమ్ముని, పోలీసులకు తిరిగిచ్చినందుకుగాను ఆ ఇద్దరు మహిళల్ని షార్జా పోలీసులు సన్మానించడం జరిగింది. సార్జా పోలీస్‌ స్టేషన్స్‌ డైరెక్టర్‌ కల్నల్‌ ఖలీఫా కలాందర్‌ మాట్లాడుతూ, రెనో భట్‌, గౌరి గిరీష్‌ అనే ఇద్దరు మఙమళలు, తమకు దొరికిన సొమ్ముని దాచుకోకుండా పోలీసులకు అప్పగించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ తరహా నిజాయితీ ప్రదర్శించేవారిని సన్మానించడం తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారాయన. మోరల్‌ వాల్యూస్‌ని తాము ప్రదర్శించడం ద్వారా వాటి పట్ల ఇతరుల్లోనూ ఆసక్తి పెరిగేలా చేయడానికి ఇలాంటి సంఘటనలు ఉపకరిస్తాయని అన్నారు ఖలీఫా కలాందర్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com