పది రోజులలో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదు

- November 08, 2017 , by Maagulf
పది రోజులలో 1,467,368  'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు'  నమోదు

కువైట్ :  అక్టోబర్ నెల మొదటి 10 రోజుల్లో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదయ్యాయి. వాటిలో 1,157,607 వేగ పరిమితిని మించి వాహనం నడపడం ,135,201 ఎర్రని సిగ్నల్ ని దాటి వెళ్లిపోవడం135.201 ఉన్నాయి. ' పరోక్ష ఉల్లంఘనలను ' ట్రాఫిక్ కెమెరా లేదా సీనియర్ మంత్రిత్వశాఖ  అధికారులు రికార్డ్ చేస్తారు, అయితే ఈ కేసులలో మోటార్ వాహనాలను ఎట్టి పరిస్థితిలోనూ నిలిపివేయరు. ముందుగా, అధికారులు ట్రాఫిక్ ఉల్లంఘనకు భారీ జరిమానాలు అమలు చేయడం ప్రారంభించారు. వాహనాలను వేగంగా డ్రైవింగ్ చేస్తే 2 నెలలపాటు వారి స్వాధీనం చేసుకొంటారు మరియు సీటు బెల్టులు లేకున్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నా పెద్ద ఎత్తున జరిమానాలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com