‘యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ క్షేమం

- November 08, 2017 , by Maagulf
‘యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ క్షేమం

రియాద్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ మరణించారని వెలువడుతున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలింది.  అజీజ్ మరణించారని పలు మీడియా, సోషల్ మీడియాలో వెలువడుతున్న వార్తలను సౌదీ సమాచార శాఖా ఖండించింది. యువరాజు అజీజ్ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా యువరాజు ప్రస్తుతం స్పందించలేరని పేర్కొంది. వదంతలు నమ్మవద్దని, వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సౌదీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 12 మంది యువరాజులతో సహా, మంత్రులు, బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకోవడం సౌదీ ఆధునిక చరిత్రలో కీలకమైన ఘటనగా పలువురు రాజకీయ నిపుణులు పేర్కుంటున్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సౌదీ ప్రభుత్వం తెలిపిన సంగతి విధితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com