మనోజ్ పెళ్లి లో స్టెప్పులు వేయబోతున్న అంబరీష్,రజని
- April 30, 2015
మంచు మనోజ్ పెళ్ళిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి మోహన్ బాబు కుటుంబం చేస్తున్న ఏర్పాట్లు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి.ఒకనాటి 5 రోజుల పెళ్లిని గుర్తు చేస్తూ మంచువారి కుటుంబం మనోజ్ పెళ్ళిని 5 రోజుల డాన్స్ హంగామాగా మారుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో ఏ పెళ్ళికి జరగనంత భారీ ఖర్చుతో ఈ పెళ్ళి ఏర్పాట్లను మంచు కుటుంబం చేస్తోంది.మే 14 తారీఖున శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంటిలో మనోజ్ ను పెళ్ళి కొడుకును చేయబోతున్నారు.ఆ తరువాత మే 17న భాగ్యనగరంలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో జరగబోతున్న సంగీత్ ఉత్సవంలో ఒక అద్భుతం జరగబోతోంది.అనేకమంది సినిమా సెలెబ్రెటీ లు మోహన్ బాబు సన్నిహితులు పాల్గొనబోతున్న ఈ ఈవెంట్ లో మోహన్ బాబుతో కలిసి రజినీకాంత్ అంబరీష్ లు ఒక పాటకు వేదిక పై స్టెప్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. మోహన్ బాబుకు రజినీకాంత్ తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా తన కొడుకు పెళ్ళిలో డాన్స్ చేయమని రజినీకాంత్ ను కోరిన వెంటనే రజినీ అంగీకరించాడని టాక్. అదేవిధంగా అంబరీష్ కూడా మోహన్ బాబు కోరికను మన్నిoచడంతో వీరి ముగ్గురి డాన్స్ లతో మంచు మనోజ్ పెళ్ళి సంబరాలలో సంగీత్ హంగామా అదిరిపోనున్నది. ప్రముఖ డిజైనర్స్ శాంటాను మరియు నిఖిల్ ఆద్వర్యంలో డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన కంచి బెనారస్ చీరలు ఈ సంగీత్ ఉత్సవానికి మరో ప్రత్యేక అ ఆకర్షణ అని టాక్. ఈ సంగీత్ ఉత్సవం తరువాత మే 18న మంచు లక్ష్మి ఇంటిలో మెహందీ ఉత్సవాన్ని కూడ చాల భారీగా మంచు లక్ష్మి నిర్వహించ బోతున్నట్లు టాక్.ఈ ఉత్సవం తరువాత మే 19న మనోజ్ తన సన్నిహితులకు టాలీవుడ్ యంగ్ హీరోలకు బ్యాచలర్ పార్టీ ఇవ్వబోతున్నాడు.ఆ మరునాడు మే 20న పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు మనోజ్.ఈ పెళ్ళి సంబరాలు అన్నింటిలోను ఎక్కడ చూసినా మల్లెపూలు కనిపించే విధంగా చేయబోతున్న అలంకరణ హైలెట్ అని అంటున్నారు.ఈ పెళ్ళి సంబరాలు అన్నింటికి మంచు లక్ష్మి యాoకరింగ్ చేస్తూ అదగోట్టబోతోంది.సూపర్ స్టార్ రజినీకాంత్ చేత స్టెప్స్ వేయించబోతున్న మంచుమనోజ్ సంగీత్ సంబరాలు సంచలనంగా మారాయి..
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







