అమ్మ వజ్రాలు చిన్నమ్మ ఆధీనమా?

- November 10, 2017 , by Maagulf
అమ్మ వజ్రాలు చిన్నమ్మ ఆధీనమా?

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యంత్రి జయలలితకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకున్న శశికళ కుటుంబ సభ్యుల దగ్గర అమ్మకు చెందిన బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయా ? అంటూ ఆరా తీయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారని తెలిసింది.
శశికళ కుటుంబ సభ్యుల అక్రమాస్తుల లెక్కలు తేల్చిన తరువాత పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఉన్న జయలలిత వజ్రాలు ఏమైనాయి, శశికళ ఫ్యామిలీలో ఎవరి దగ్గర వజ్రాలు ఉన్నాయి ? అని పూర్తి సమాచారం సేకరించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం.
జయలలిత ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అధికారికంగా తన దగ్గర వజ్రాలు, బంగారు నగలు ఉన్నాయని ఎన్నికల అధికారుల ముందు దృవీకరించారు. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ జయలలిత మరణించిన తరువాత ఆమెకు చెందిన పోయెస్ గార్డెలోని వేదనిలయం బంగ్లాను శశికళ కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు.
జయలలితకు చెందిన ఆస్తులు మొత్తం శశికళ కుటుంబ సభ్యుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. జయలలిత ఇంటిలో ఉన్న వజ్రాలు, బంగారు నగలు మాయం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు తరువాత జయలలిత ఆభరణాలు, వజ్రాల గురించి ఆరా తీయ్యాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com