పాకిస్తానీయులకు వైద్య వీసా మంజూరు: సుష్మా స్వరాజ్
- November 10, 2017
కరాచీ: భారత్‌లో వైద్య నిమిత్తం పాకిస్తానీయులకు మరిన్ని వీసాలు ఇవ్వనున్నట్లు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించిన నేపధ్యంలో తాజాగా శుక్రవారం మరో పాకిస్తాన్ జాతీయునికి వీసా మంజూరైంది. భారత్‌లో వైద్య వీసాను అనుమతిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్ ద్వారా శుక్రవారం అమ్నాకు తెలిపారు. కరాచి నుండి అమ్నా అనే యువతి అభ్యర్థన మేరకు ఆమె తండ్రి షమీమ్ అహ్మద్ వైద్య నిమిత్తం వీసాను మంజూరు చేశారు. దీనికి కొనసాగింపుగా షమీమ్ అక్టోబర్ 9న కాలేయ మార్పిడి ఆపరేషన్‌కు సహకరించాలని శ్రీ గంగా రామ్ ఆసుపత్రి డాక్టర్ సూచించిన లేఖను కూడా పోస్ట్ చేశారు. భారత్, పాక్‌ల మధ్య ఇతర సమస్యలు ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం మే నెలలో అప్పటి ప్రధాన మంత్రి, విదేశాంగ వ్యవహారాల సలహాదారుడు శరత్ అజీజ్ మెడికల్ వీసాను ఇవ్వమని భారత్‌ను కోరారు. ఈ లేఖపై పాకిస్తాన్ ప్రభుత్వం అప్పట్లో మండిపడింది. పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రాంతంలోని రోగి న్యూఢిల్లీలో ఆపరేషన్ చేయించుకోవడానికి వీసా ఇవ్వవలసిందిగా జులై 18న కోరారు. దీనికి సుష్మాస్వరాజ్ స్పందిస్తూ పాకిస్తాన్ నుండి ఎటువంటి సిఫార్సు అవసరం లేదని, ఎందుకంటే ఆ ప్రాంతం భారతదేశంలో ఓ భాగమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









