పేద విద్యార్థులకు విరాళంగా తమిళ్ హీరో ఔదార్యం

- November 11, 2017 , by Maagulf
పేద విద్యార్థులకు విరాళంగా తమిళ్ హీరో ఔదార్యం

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటల్ని అక్షరాలా ఆచరించే వారు కొందరే ఉంటారు. వారు ఎప్పటికీ చిరస్థాయిగా అందరి మనస్సుల్లో నిలిచిపోతారు. సాధారణంగా మంచి ఫామ్‌లో ఉన్న హీరో హీరోయిన్లు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఇలా వద్దంటే వచ్చి పడుతున్న డబ్బుతో కొంతమంది నటీనటులు కొన్ని మంచి పనులు చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటారు. ఇప్పుడు ఆ బాటలో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా నిలుస్తున్నారు. 

తమిళంలో విలక్షణ నటుడిగా గుర్తింపు ఉన్న సేతుపతి తెలుగులో చిరంజీవి సైరా సినిమాలో కూడా కనిపించనున్నారట. అయితే విజయ్ తమిళనాడులోని అనిల్ సేమియా అనే కంపెనీకి ప్రచార కర్తగా ఉన్నారు. ఇందులో నటిస్తున్నందుకుగాను రూ.50లక్షల పారితోషికాన్ని అందించింది అనిల్ కంపెనీ విజయ్‌కి. అయితే ఈ మొత్తాన్ని తమిళనాడులోని అత్యంత వెనుకబడిన జిల్లా అరియలూర్‌‌లోని 774 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా 10 అంధుల పాఠశాలలకు, 11 బధిర పాఠశాలలకు కూడా కొంత మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయ్ చేస్తున్న ఈ సహాయానికి, తమపట్ల విజయ్ చూపిస్తున్న ఔదార్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సహాయం పొందినవారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com