గిన్నిస్‌ రికార్డుకెక్కిన గాలిలో ప్రయాణించే రియల్‌ లైఫ్ ‘ఐరన్‌ మ్యాన్‌’

- November 11, 2017 , by Maagulf
గిన్నిస్‌ రికార్డుకెక్కిన గాలిలో ప్రయాణించే రియల్‌ లైఫ్ ‘ఐరన్‌ మ్యాన్‌’

అచ్చం ఐరన్‌ మ్యాన్‌ సినిమాలో హీరోలానే జెట్‌ సూట్‌ వేసుకొని గాలిలో ప్రయాణించి బ్రిటిషర్‌ రిచర్డ్‌ బ్రౌనింగ్‌ రియల్‌ లైఫ్‌ ‘ఐరన్‌ మ్యాన్‌’ అనిపించుకున్నారు. రిచర్డ్‌ ప్రపంచంలోనే వేగంగే పయనించే రియల్‌ లైఫ్‌ ఐనన్‌ మ్యాన్‌. జెట్‌ ఇంజన్‌ పవర్‌ సూట్‌తో ఆయన గంటకు 51.53 కిలో మీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించి గిన్నిస్‌ రికార్డ్‌లో ఎక్కారు. ఈ ప్రయత్నం ఇంగ్లాండ్‌లోని రీడింగ్‌ సరస్సుపై చేశారు.  సినిమాలో లాగే గాల్లో ప్రయాణించేందుకు సహకరించే విధంగా ఆ సూట్‌లో జెట్‌ ఇంజన్‌ ఉంటుంది. రిచర్డ్‌ బ్రౌనింగ్‌ చాలా సార్లు విఫలమైనా పట్టు వదలకుండా అనుకున్నది సాధించి రియల్‌ లైఫ్ ఐరన్‌ మ్యాన్‌ అనిపించుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com