నారా రోహిత్‌ నటించిన బాలకృష్ణుడు థియేట్రికల్ ట్రైలర్ అదిరింది

- November 11, 2017 , by Maagulf
నారా రోహిత్‌ నటించిన బాలకృష్ణుడు థియేట్రికల్ ట్రైలర్ అదిరింది

"ఈ క్షణం నువ్వు చావు నుంచి తప్పించుకోవచ్చు.. అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు చచ్చేదాకా.." అంటూ సీరియస్‌గా డైలాగ్స్ చెప్పేశారు నారా రోహిత్. శుక్రవారం ఆడియో రిలీజ్ సందర్భంగా బాలకృష్ణుడు సినిమా థియేట్రికల్ టైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా నారా రోహిత్‌ని చూడవచ్చు. "లెట్స్ స్టార్ట్ ద జర్నీ డ్యూడ్" అంటూ పృథ్వీ కామెడీ హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. 'గురువుగారు' అని రోహిత్‌.. పృథ్వీని పిలిస్తే.. "గురువు గారు.. గురువుగారు అంటూ ఊళ్లో గూండాలందరినీ పరిచయం చేశావు కదరా" అంటూ పృధ్వీ కడుపుబ్బ నవ్వించారు. రమ్యకృష్ణ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో రోహిత్ సరసన రెజీనా నటించింది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com