ప్రొఫెస్సర్ సృష్టిస్తున్న సంచలనం

- November 12, 2017 , by Maagulf
ప్రొఫెస్సర్ సృష్టిస్తున్న సంచలనం

ఆగ్రా: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించినా కొందరు మాత్రం ఇంకా దానిని ఆచరిస్తూనే ఉన్నారు. ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ ప్రోఫెసర్ తన భార్యకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో సంస్కృత భాషా విభాగానికి చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్‌ ఖలీద్ బిన్ యూసఫ్ ఖాన్ తన భార్యకు వాట్సాప్‌ ద్వారా తలాక్‌ సందేశం పంపారు.
ఆపై మరో టెక్స్ట్ మెసేజ్ పెట్టి తలాఖ్ చెప్పాడు. అటుపై ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. డిసెంబర్ 11వ తేదీలోగా తనకు న్యాయం జరగకపోతే తన ముగ్గురు బిడ్డలతో కలిసి వీసీ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు యాస్మీన్ ఖలీద్ హెచ్చరించారు.
న్యాయం కోసం తాను యూనివర్సిటీలోని క్రింది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందర్నీ వేడుకుంటున్నానని, అయినా తనకు ఎవరూ సహాయపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై స్పందించిన ప్రొఫెసర్ ఖలీద్... తాను షరియత్ చట్టప్రకారం విడాకులు పొందానని అన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ లతోపాటు ఇద్దరు సాక్షుల ఎదుట నోటి మాటల ద్వారా కూడా తలాక్ చెప్పానని పైగా నిర్ణిత కాల పరిమితిని కూడా పాటించినట్లు ఆయన చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com