ఆదిలోనే అవాంతరాలు ఎదుర్కొంటున్న 'లక్ష్మీస్ వీరగ్రంథం'

- November 12, 2017 , by Maagulf
ఆదిలోనే అవాంతరాలు ఎదుర్కొంటున్న 'లక్ష్మీస్ వీరగ్రంథం'

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న " లక్ష్మీస్ వీరగ్రంథం " చిత్రానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆదివారం ఈ మూవీ షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. షూటింగ్ కు అనుమతి లేదని, పైగా అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తులో సినిమా పేరు, వివరాలు లేవని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే తాను పర్మిషన్ తీసుకున్నానని, ఎలాగైనా చిత్రం తీస్తానంటూ కేతిరెడ్డి క్లాప్ కొట్టారు.
ఎన్టీఆర్ ఆత్మ ప్రబోధం మేరకు తను ఈ సినిమా తీస్తున్నానని, ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రను గౌరవప్రదంగా, ఆదర్శ గృహిణిలా చూపుతున్నానని ఆయన అన్నారు. తమ మూవీకి లక్ష్మీ పార్వతి స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరిన ఆయన..ఆమె ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారని విమర్శించారు. ఆమె సహకరించకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. నేను ఈ చిత్రాన్ని చంద్రబాబు కోణం లోనుంచి తీస్తున్నా..నా సినిమా పూర్తయ్యి, అది చూశాక లక్ష్మీ పార్వతికి ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టులో చూసుకోవచ్చు..నేనూ కోర్టులోనే చూసుకుంటా అని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, జనవరిలో విడుదల చేసేలా చూస్తానని కేతిరెడ్డి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com