మగధీరుని గుర్రపు స్వారీ
- November 12, 2017
హైదరాబాద్: కథానాయకుడు రామ్‌చరణ్‌కి గుర్రాలు, శునకాలంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా వాటితో ఆడుకుంటుంటారు. ఇలా అనేక సందర్భాల్లో తీసిన ఫొటోలు, వీడియోలను రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఆమె మరో వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
అందులో రామ్‌చరణ్ నల్లగుర్రాన్ని స్వారీ చేస్తూ కనిపించారు. 'మగధీర' సినిమాలో రామ్‌చరణ్ ఓ గుర్రంపై సందడి చేశారు గుర్తుందా. ఇప్పుడు ఆయన సవారీ చేసిన గుర్రం కూడా అదేనట. ఈ విషయాన్ని ఉపాసన తెలిపారు. 'మిస్టర్ సి (చరణ్) వీకెండ్‌ను తన పాత స్నేహితుడు 'మగధీర' గుర్రంతో గడుపుతున్నారు' అని ఉపాసన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
రామ్‌చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష