ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆలోచన లేదు

- November 12, 2017 , by Maagulf
ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆలోచన లేదు

దిల్లీ: దేశంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ తీసుకురావాలన్న ఆలోచన లేదని.. వాటిని ఏర్పాటు చేయబోమని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా దాఖలైన ప్రశ్నకు ఆర్‌బీఐ బదులిచ్చింది. దేశ ప్రజల ప్రయోజనాలు, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇస్లామిక్‌ బ్యాంకులపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్చించినట్లు తెలిపింది.
ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అనేది వడ్డీ రహిత బ్యాంకింగ్‌ విధానం. ఈ బ్యాంకింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని 2008లో అప్పటి రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై పరిశీలనలు జరపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐలోని ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ గ్రూప్‌(ఐడీజీ).. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లోని న్యాయబద్ధమైన, సాంకేతిక, రెగ్యులేటరీ సమస్యలను పరిశీలించింది.

దీనిపై గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థికశాఖకు నివేదిక పంపింది. ఈ బ్యాంకింగ్‌ విధానాన్ని అంచెలంచెలుగా తీసుకొస్తే బాగుంటుందని ఐడీజీ నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ప్రసుత్తం అలాంటి ఆలోచనే లేదని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com