సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వ నాశనం

- November 12, 2017 , by Maagulf
సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వ నాశనం

సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వ నాశనమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. అందుకే తాను పాలిటిక్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు స్పష్టం చేశాడు. ఆదివారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించడం, పార్టీలు పెట్టడాన్ని సమర్ధించనన్నాడు. ప్రతి నటుడికి కుల, మత వర్గాలకు అతీతంగా అభిమానులు ఉంటారని, రాజకీయాలన్నవి సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డాడు.
పాలిటిక్స్ కొన్ని వర్గాల అభిమానులను దూరం చేస్తాయి. వారి పట్ల నటులు బాధ్యతతో ప్రవర్తించాలంటే రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిది. అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. సినీ నటులు రాజకీయ ఆరంగేట్రం చేయడాన్ని ఆయన ప్రకృతి విపత్తుతో పోల్చాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మరో అగ్ర నటుడు కమల్ హసన్ త్వరలో తాము పార్టీలు పెట్టబోతున్నామంటూ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈ మధ్య కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com