ఎయిర్ ఏషియా వారి సూపర్ డూపర్ ఆఫర్
- November 12, 2017
న్యూఢిల్లీ: మలేషియాకు చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా తమ ప్రయాణికుల కోసం సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ ప్రయాణికులకు ఓ వైపు టికెట్‌ను రూ.99కే అందిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోని తమ జేవీ ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌పై దేశీయ ప్రయాణికులకు రూ.99, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.444 బేస్ రేట్‌పై టికెట్లు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ రాయితీ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు వచ్చే ఏడాది మే నుంచి జనవరి 2019 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు.
జోహార్ నుంచి కోల్‌కతా ప్రయాణించాలనుకునే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ ఏషియా బెర్హాద్.. సీట్లకు జీరో బేస్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ప్రయాణికులు కేవలం ఫ్లైట్ ట్యాక్స్‌లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఆఫర్ టికెట్ల విక్రయం నేటి అర్ధ రాత్రి నుంచి ఈనెల 19 వరకు కొనసాగుతుందని పేర్కొంది. అలాగే ఎయిర్ లైన్స్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా విక్రయించే టికెట్లతో బెంగళూరు, కోచి, హైదరాబాద్, రాంచి, భువనేశ్వర్, కోల్‌కతా, న్యూఢిల్లీ, గోవా నగరాలకు ప్రయాణించవచ్చు. అంతర్జాతీయ టికెట్లపై తిరుచరాపల్లి, కోచి, ఢిల్లీ, భువనేశ్వర్, జైపూర్ నుంచి కౌలాలంపూర్‌కు, ముంబై, కోల్‌కతా నుంచి బాలి, జైపూర్, కోల్‌కతా, కోచి, చెన్నై, బెంగళూరు నుంచి బ్యాంకాక్ ప్రయాణించవచ్చు.
ఎయిర్ ఏషియా బెర్హాద్, ఎయిర్ ఏషియా X బెర్హాద్, ఇండోనేషియా ఎయిర్ ఏషియా X, ఇండోనేషియా ఎయిర్ ఏషియా, థాయ్ ఎయిర్ ఏషియా తదితర విమానాల్లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా వివరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష