సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'

- November 12, 2017 , by Maagulf
సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'

రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'. తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ లాంటి కొత్త తరం హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. నటనలో ప్రవీణ్యం లేకున్న అద్భుతంగా నటించారు ఈ యంగ్ బ్లాడ్ స్టార్స్. ఎలాంటి ఆటంకం లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్  పూర్తి చేసుకుంది. వైజాగ్, అరకులో ఉన్న అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంది. డిసెంబర్ లో ఈ  సినిమా ఆడియో విడుదల చేసి...జనవరిలో ఈ  సినిమాని సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్  సన్నాహాలు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com