ఐసిస్ లో వందమంది కేరళీయులు!

- November 12, 2017 , by Maagulf
ఐసిస్ లో వందమంది కేరళీయులు!

తిరువనంతపురం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో ఇప్పటి వరకు వందమంది కేరళీయులు చేరి ఉండవచ్చని కేరళ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 300కు పైగా ఆడియో క్లిప్పులు, వివిధ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు.
21 మంది కేరళీయులు కనిపించకుండా పోవడంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ వారంతా ఇస్లామిక్ స్టేట్‌లో చేరి ఉంటారని భావిస్తోంది. తాజాగా ఓ మహిళకు ఫోన్ వచ్చిన ఫోన్‌ కాల్‌ను పరిశీలించిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఐసిస్‌లో చేరిన ఓ మహిళ భర్త షాజిల్ 'జిహాద్ వార్'లో మరణించినట్టు ఆమెకు చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో సిరియాలోనే ఉంది. చాలామంది కేరళ యువతులు తమ భర్తలను పోగొట్టుకుని పిల్లలతో కలిసి సిరియాలో ఉన్నట్టు ఆమె పేర్కొంది. ఈ ఆడియో క్లిప్ షాజిల్ సోదరుడి నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.
ఖయూమ్ అనే మరో వ్యక్తి ఆడియో క్లిప్ కూడా పోలీసులకు చిక్కింది. ఐసిస్ యూనిఫామ్‌లో ఉన్న ఖయూమ్ ఫొటోలు ఇంటర్నెట్‌లో విరివిగా ఉన్నాయి. ఐసిస్‌తో సంబంధాలున్న ముగ్గురిని అక్టోబరు 25న పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఏళ్ల క్రితమే కేరళను విడిచిపెట్టి సిరియా వెళ్లారు. అక్కడ వారు ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com