నాన్నలాగ నన్ను హత్య చేస్తారేమో: లెబనాన్‌ ప్రధాని

- November 13, 2017 , by Maagulf
నాన్నలాగ నన్ను హత్య చేస్తారేమో: లెబనాన్‌ ప్రధాని

తనకు సొంతదేశం లెబనాన్‌లో ప్రాణహానీ ఉంది తప్ప, సౌదీ అరేబియాలో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు లెబనాన్‌ ప్రధాని సాద్‌ హరీరి. ఆదివారం లెబనాన్‌లో జరిగిన నిరసన, ధర్నాలపై హరీరి తాజాగా స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, కోరుకున్నప్పుడు స్వదేశానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. రేపు వెళ్లాలనిపిస్తే అదే సమయంలో లెబనాన్‌కు బయలుదేరతానని తాను అంత స్వతంత్రంగా ఉన్నానని తెలిపారు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని హరీరి రాజీనామాను అధ్యక్షుడు మైఖెల్‌ అవాన్‌ ఇంకా ఆమోదించలేదని సమాచారం.

2005లో తన తండ్రి, అప్పటి ప్రధాని ని బాంబుదాడి జరిపి రాజకీయ హత్యకు పాల్పడ్డారని.. ప్రస్తుతం తనను కూడా రాజకీయహత్య చేసే అవకాశాలున్నాయని హరీరి ఆరోపించారు. అమెరికా హిజ్బుల్లాలను లక్ష్యంగా చేసుకుందని, అదే విధంగా అరబ్‌ దేశాల కోరిక మేరకు ప్రభుత్వం నడుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యెమన్‌, బహ్రెయిన్‌ దేశాలపై ఇరాన్‌, హిజ్బుల్లాలు తరచుగా జోక్యం చేసుకుంటున్నాయని చెప్పారు. మన ఉత్పత్తులను అరబ్‌ దేశాలకు నిషేధిస్తే మరెక్కడికి ఎగుమతి చేయాలని ప్రశ్నించారు. మన తర్వాతి తరం ఏ విధంగా మనుగడ సాధిస్తుందో అర్థం కావడం లేదని, రాజకీయ కారణాలతో సౌదీ అరేబియా పర్యటనలో ఉండగానే ఆయన ఒక వీడియో సందేశం ద్వారా రాజీనామా ప్రకటన చేశారు. హరీరి రాజీనామా విషయం వెలుగుచూసిన రోజే సౌదీలో యువరాజులు, మంత్రులు, వ్యాపార దిగ్గజాల అరెస్టులు మొదలు కావడం పలు అనుమాలకు దారి తీస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com