చైతు, సమంత రిసెప్షన్ కు డుమ్మా కొట్టిన బాలయ్య
- November 13, 2017నాగార్జున తనయుడు నాగ చైతన్య సమంతకు అక్టోబర్ 6న మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో పెళ్లి తంతు కానిచ్చేసుకున్న వీరు హైదరాబాద్ లో నిన్న రిసెప్షన్ జరుపుకున్నారు. ఇక ఈ రిసెప్షన్ కు సిని, రాజకీయ ప్రముఖులు అంతా అటెండ్ అయ్యారు. అంతా బాగానే ఉంది కాని ఈ రిసెప్షన్ కు బాలకృష్ణ రాకపోవడం మళ్లీ హాట్ హ్యూస్ గా మారింది.
బాలయ్య, నాగ్ ల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయన్న వార్తలను అప్పట్లో ఇద్దరు ఖండించారు. నట దిగ్గజాల వారసులైన వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. కాని బాలయ్య చైతు సమంతల రిసెప్షన్ కు రాకపోయే సరికి మళ్లీ ఇద్దరి మధ్య గొడవలపై వార్తలు బయటపడుతున్నాయి. నాగార్జున బిజినెస్ పార్ట్ నర్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కు సన్నిహితుడు.
ఇక నాగార్జున కూడా దాదాపు జగన్ కు సపోర్ట్ గా మారాడు. అందుకే బాలయ్య నాగార్జునల మధ్య వైరం మొదలైందని అన్నారు. సినిమా వాళ్లు కాబట్టి కలిసినప్పుడు ఏదో హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉంటారు. అసలు లోపల వైరం మాత్రం అలానే ఉంటుంది. అదే పంథాలో నాగార్జున ఆహ్వానాన్ని బాలయ్య కాదన్నాడని టాక్.
చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో పాటుగా బాలకృష్ణ కూడా వచ్చి ఉంటే బాగుండేది కాని రాలేదు. రిసెప్షన్ వేడుక అంతా అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్ లో జరిగిన రిసెప్షన్ కు సిని పొలిటికల్ కలర్ అదిరిపోయింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష