'ఇంద్రసేన' గా వస్తున్న బిచ్చగాడు
- November 13, 2017
తెలుగు ఇండస్ట్రీలో 'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. దీంతో తన మార్కెట్ పరిధిని పెంచుకోవడం కోసం ఆయన నటిస్తున్న సినిమాలను వరుసగా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'అన్నాదురై'. తెలుగులో 'ఇంద్రసేన' పేరుతో అనువాదం కానుంది. కాగా ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న విడుదల చేయనున్నారు.
సినిమాని 30న రెండు భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో 'బేతాళుడు' చిత్రం విడుదల సందర్భంలో ఇదే ఫార్ములాను ఫాలో అయిన విజయ్ ఆంటోనీ సక్సెస్ కావడంతో.. ఇంద్రసేన విషయంలో అదే ఫాలో అయిపోతున్నాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వాస్తవానికి మనోడు నటించిన డాక్టర్ సలీమ్, నకిలీ చిత్రాలు తెలుగు లో వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు..కానీ బిచ్చగాడు సినిమా తర్వాత మనోడి స్టార్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో తమిళంతో పాటు తెలుగు లో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ఈ సినిమా శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని ఆంటోనీ ఫిలిం కార్పోరేషన్, రాధికా శరత్ కుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన డయానా చంపిక జంటగా నటిస్తుండగా.. నవంబర్ 30న భారీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష