సంచలనం సృషిటిస్తున్న లలితా జ్యూయలర్స్ యాడ్

- November 13, 2017 , by Maagulf
సంచలనం సృషిటిస్తున్న లలితా జ్యూయలర్స్ యాడ్

ఈ మధ్య టీవీ చానెల్స్‌లో అదరగొడుతున్న లలితా జ్యూయలర్స్ యాడ్ ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఆ యాడ్‌లో ఏకంగా లలిత జ్యూయలర్స్ యాజమాని అయిన కిరణ్ వచ్చి మార్కెట్‌లో అంటూ.. బంగారం విలువ గురించి లలిత జ్యూయలర్స్ గురించి చెప్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారుఇది బాగా గమనించే లండన్ బాబులు చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు.
ఆయన చేస్తున్న ప్రమోషన్ హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా లలిత జ్యూయలర్స్ సేల్స్ పెరగడానికి కూడా కారణం అవుతోంది. ఇప్పడిదే స్ఫూఫ్‌తో లండన్ బాబులు టీమ్ ప్రమోషన్‌కి దిగింది.డబ్బు ఎంతో విలువైంది. కానీ సమయం అంతకంటే విలువైంది. ఇంత వరకు మీరు ఎంతో ఖర్చుపెట్టి ఎన్నో సినిమాలు చూసుంటారు. ఇక ఖర్చుపెట్టింది చాలు.
నవంబర్ 17న మా లండన్ బాబులు మూవీని థియేటర్‌కి ఒక్కసారి వచ్చి చూడండి. మీరు పెట్టే ప్రతి పైసాకి రెట్టింపు ఆనందం ఇచ్చే హామీ మాది.నవంబర్ 17న లండన్ బాబులు రిలీజ్.'' అంటూ విలన్ పాత్రలు చేసే అజయ్ ఘోష్‌, లలిత జ్యూయలర్స్ కిరణ్‌ని ఇమిటేట్ చేస్తున్న వీడియోలు ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వీడియోలతో అటు కామెడీని, ఇటు సినిమా ప్రమోషన్‌ని చేస్తున్నారు చిత్రయూనిట్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com