భారీ పారితోషికానికి అయోమయంలో పడ్డ పవన్ కళ్యాణ్

- November 13, 2017 , by Maagulf
భారీ పారితోషికానికి అయోమయంలో పడ్డ పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ఎవరితో చేయబోతున్నాడనేది ఇంకా అయోమయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన గ్యాసిప్ వినబడుతోంది.పవన్‌తో సినిమా చేసేందుకు `మైత్రీ మూవీస్‌` చాలా రోజుల నుంచి ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం పవన్‌కు ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. పవన్ అంగీకరిస్తే పవన్ రెమ్యునరేషన్‌తో కలిపి రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ముందుగానే పవన్‌కు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారట. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ ఆఫర్‌కు పవన్ ఆయోమయంలో పడ్డాడట. ఏమి చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నాడట.నిజానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత `జనసేన` పనులతో బిజీ కావాలని పవన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే మాత్రం దక్షిణాదిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ రికార్డు సృష్టిస్తాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com