బిగ్ బీ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న నాగ్

- November 13, 2017 , by Maagulf
బిగ్ బీ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న నాగ్

రామ్ గోపాల్ వర్మతో అక్కినేని నాగార్జున మళ్లీ ఓ సినిమా చేయబోతున్నాడంటే చాలామందికి నమ్మకం కలగలేదు. కానీ స్వయంగా నాగార్జునే ఈ ప్రాజెక్టును కన్ఫమ్ చేయడమే కాక.. ఈ నెల 20న షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించడంతో ఈ వార్త నిజమే అని రూఢి అయింది. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేయబోతున్నాడని.. అందుకోసం బాడీ షేప్ మార్చుకునే ప్రయత్నంలో కూడా ఉన్నాడని ఇప్పటికే వెల్లడైంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఇంకే సమాచారం బయటికి రాలేదు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులెవరు.. సాంకేతిక నిపుణులు ఎవరు అన్నది వెల్లడి కాలేదు. అసలీ సినిమాలో నాగార్జునకు హీరోయిన్ ఉందా లేదా అన్నది కూడా తెలియదు.
ఐతే హీరోయిన్ సంగతేమో కానీ.. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నాడట. ఆయనది ఒక స్పెషల్ రోల్ అని.. సినిమాకు అది ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. అమితాబ్ బచ్చన్ తో నాగ్, వర్మలిద్దరికీ మంచి సంబంధాలున్నాయి.

నాగార్జునతో 'ఖుదాగవా' సినిమాతో పాటు కొన్ని ప్రకటనలు కూడా చేశాడు అమితాబ్. ఇక వర్మతో ఆయన సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్-3, డిపార్ట్ మెంట్, నిశ్శబ్ద్ లాంటి సినిమాలు చేశాడు. వర్మ దర్శకుడిగా బాగా డౌన్ అయ్యాక కూడా అతడిని నమ్మి సినిమాలు చేశాడు బిగ్-బి. అతడి మీద ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది.

ఆ అభిమానంతోనే నాగ్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడానికి అంగీకరించాడట. బిగ్-బి రాకతో ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసుకునే సౌలభ్యం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com